నంద్యాలలో ‘బయోడైజెస్టర్‌’ | - | Sakshi
Sakshi News home page

నంద్యాలలో ‘బయోడైజెస్టర్‌’

Apr 19 2026 8:11 AM | Updated on Apr 19 2026 8:11 AM

నంద్యాల(న్యూటౌన్‌): నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణను శాసీ్త్రయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో రూ. 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యంత్రం రోజుకు 1000 కిలోల తడి చెత్తను ఎరువుగా మారుస్తుందన్నారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహ స్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. తయారైన ఎరువును 30 రోజుల పాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ ఉంచితే అది మెత్తటి పొడి రూపంలోకి మారుతుందన్నారు. పట్టణంలోని హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ కేంద్రానికి తరలించి ఎరువుగా మార్చుకోవచ్చన్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

నాణ్యమైన విద్య

బనగానపల్లె రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లావిద్యాధి కారి జనార్దన్‌రెడ్డి అన్నారు. టంగుటూరు, బనగానపల్లె కొండపేట మోడల్‌ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బడి పిలుస్తోందని ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్‌లు, నోటుపుస్తకాలు అందుతాయన్నారు. ర్యాలీ అనంతరం బనగానపల్లెలోని ఒక పాఠశాలలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై డోన్‌ డి విజన్‌ స్థాయి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇ చ్చారు. డోన్‌ డిప్యూటీ డీఈఓ వెంకటరెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ ఆఫీసర్స్‌ మాధవీలత, రామ్మోహన్‌, ఎంఐఎస్‌ అండ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంఈఓ స్వరూప పాల్గొన్నారు.

జూట్‌ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రేషన్‌కార్డు కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జూట్‌ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌ కె.పుష్పక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 20 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 9000710508, 9666224931, 9440905477, 08518– 273710 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement