అడిషనల్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం

Apr 19 2026 8:11 AM | Updated on Apr 19 2026 8:11 AM

నందికొట్కూరు: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడిషనల్‌ సివిల్‌ జడ్జి కోర్టు ను శనివారం హైకోర్టు జడ్జి, ఆంధ్రప్రదేశ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి బి. కృష్ణమోహన్‌ ప్రారంభించారు. ఈయన వెంట హైకోర్టు జడ్జీలు కొనకంటి శ్రీనివాసరెడ్డి, ఎ. హరిహరనాథ శర్మ ఉన్నారు. వీరికి జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కబర్ధి, కర్నూలు జడ్జి రాజేంద్రప్రసాద్‌, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, స్థానిక జడ్జిలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, వేద పండితులు పూర్ణ కుంభంతో, మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అడిషనల్‌ కోర్టులో హైకోర్టు జడ్జీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సర్వమతాల ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి కృష్ణ మోహన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక కోర్టులపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 అదనపు కోర్టులు, కర్నూలు జిల్లాలో 21 అదనపు కోర్టులను మంజూరు అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామాంజనేయులునాయక్‌, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement