సమష్టి పోరు | - | Sakshi
Sakshi News home page

సమష్టి పోరు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

సమష్టి పోరు

రాయలసీమ రైతులది

త్యాగం కాదా?

సీమకు అన్యాయం చేస్తే

సహించేది లేదు

సీమపై చంద్రబాబుకు

చిన్న చూపు

రాయలసీమను

ఏడారి చేసే కుట్రలు

రాయలసీమకు వెన్ను పోటు

సీమ గురించి ఆలోచించింది వైఎస్సార్‌ కుటుంబమే

తెలంగాణ సీఎంకు లిఫ్ట్‌ పనులు గిఫ్ట్‌గా ఇచ్చారు

3.30 లక్షల కోట్లు ఖర్చు చేసి ఏంచేశావు చంద్రబాబు

చంద్రబాబు సిగ్గు పడాలి

భావి తరాల భవిష్యత్తు కోసం

పోరాడుదాం

రైతుల పక్షాన పోరాడుదాం

పోరాటానికి సమయం ఆసన్నమైంది

చంద్రబాబు పాలనలో సీమకు అన్యాయం

సీమ ప్రాజెక్టుల సాధనకు వైఎస్సార్‌సీపీ పోరు

రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు. రాయలసీమ గురించి జగనన్న రాయలసీమ లిఫ్ట్‌ పనులు ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు మేలు చేసే విధంగా జగనన్న చేస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కోసం నిలిపివేయడం దారుణం. రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుందాం. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రజలు, రైతుల గురించి ఆలోచిస్తున్న జగనన్నకు మద్దతుగా ఉద్యమ బాట పడదాం.

– బుట్టా రేణుక, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త

మాట్లాడుతున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శైలజానాథ్‌,

నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు

కర్నూలు(టౌన్‌): చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైతులంటే ఆయనకు గిట్టదు. తాగునీరు, సాగునీటి విషయంలో సీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇక పోరుబాట తప్పదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీమ ప్రాంత పెండింగ్‌ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్‌, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సీమలో నీళ్లు పారాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం అమరావతి జపం సాగుతోందన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు.. సీమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట తప్పదని నేతలు హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం కర్నూలు బిర్లా సర్కిల్‌లోని శ్రీలక్ష్మి ఫంక్షన్‌ హాలులో ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు– సమాలోచన’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, కర్నూలు పార్లమెంట్‌ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్‌ అలీఖాన్‌, కర్నూలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్‌, తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి, మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌, పార్టీ నేతలు షరీఫ్‌, కిషన్‌, రాఘవేంద్ర, పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్‌ హనుమంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, నరసింహులు యాదవ్‌, రామాంజనేయులు, మహిళా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, సిట్రా సత్యనారాయణమ్మ, గాజుల శ్వేతారెడ్డి, సిద్దారెడ్డి రేణుకా, అరుణ, మంగమ్మ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ ప్రాంతానికి చెందిన 26వేల మంది రైతులు త్యాగం చేశారు. ఊళ్లు ఖాళీ చేశారు.. గూడు కోల్పోయారు. మరి అమరావతిలో 28వేల మంది రైతుల త్యాగం మాత్రమే చంద్రబాబుకు కనిపిస్తుందా. సీమ రైతులది త్యాగం కాదా. సీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం జగనన్న రూ.900 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు చేపట్టారు. 10 శాతం పనులతో మొత్తం లిఫ్ట్‌ పూర్తవుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాడని లిఫ్ట్‌ పనులు నిలిపేశావు. లిఫ్ట్‌ వల్ల 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

– ఎస్వీ మోహన్‌ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు

సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు. 1995 సంవత్సరం నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎం అయిన దివంగత వైఎస్సార్‌ వల్లే ఎస్సార్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులతో నీళ్లు పారాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నా ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. వేదావతి, గుండ్రేవుల కోసం ఉద్యమిద్దాం. లిఫ్ట్‌ పనులు సాధించుకుందాం. సీమకు అన్యాయం జరుగుతున్నా రాయలసీమ టీడీపీ నేతలకు పౌరుషం లేదా?. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుదాం.

– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతం అంటే చిన్న చూపు. సీమలో పుట్టిన చంద్రబాబుకు చీము నెత్తురు లేదు. దివంగత నేత వైఎస్సార్‌ రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఆచరణలో చూపిస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఏ మాత్రం సాధ్యం కాదన్నారు. గురు శిష్యులు కలిసి రాయలసీమ రైతాంగాన్ని దగా చేశారు.

– వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే

చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏడారి చేసే కుట్రలు చేస్తున్నారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తెలంగాణ సీఎం అడిగారని పనులు నిలిపివేయించారు. సీమ ద్రోహి చంద్రబాబు. సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై పోరాటం చేద్దాం.

– బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే

రాయలసీమకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. సీమకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీమ ప్రాంత రైతులు, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్‌ పనులకు శ్రీకారం చుడితే ఆ పనులు నిలిపివేసి చంద్రబాబు ద్రోహిగా నిలిచారు. సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. – డాక్టర్‌ మధుసూదన్‌, ఎమ్మెల్సీ

సీమ ప్రాంతానికి న్యాయం జరిగిందంటే ఒక్క వైఎస్సార్‌ కటుంబంతోనే. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44వేలకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదే. రాయలసీమ లిఫ్ట్‌ పనులను నిలిపి వేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుదాం. లిఫ్ట్‌తో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్‌

తెలంగాణ సీఎంకు సీమ ప్రాంతంలో జరుగుతున్న లిఫ్ట్‌ పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడు గిఫ్గ్‌గా ఇచ్చారు. సీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. జగనన్న హయంలో మంజూరైన లా యూనివర్సిటీని కూడా తరలించారు. హైకోర్టును లేకుండా చేశారు. తెలంగాణ కోసం 6 జిల్లాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. – బీవై రామయ్య,

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

రెండేళ్లలో చంద్రబాబు నాయుడు 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం ప్రారంభించారా?. 10 పైసలు ఖర్చు చేసి వంద రూపాయిల బిల్డప్‌ తప్ప ఆయన చేసిందేమీ లేదు. రాయలసీమ వ్యక్తి అయిన చంద్రబాబు ఎప్పుడూ అమరావతి జపమే చేస్తున్నాడు. సీమ ప్రాంత ప్రజలు ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – వై.సాయిప్రసాద్‌ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా సిగ్గు పడాలి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. సీమ ప్రాంత రైతులను దగా చేశారు. రైతులంటే ఎందుకంత కోపం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే లిఫ్ట్‌ పనులు నిలిపి వేసి చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోసం సీమ ప్రజలను నాశనం చేస్తావా? ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు. హంద్రీనీవా అంటే దివంగత వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు రైతులకు ఏం చేశాడో చెప్పాలి.

– కంగాటి శ్రీదేవి, పత్తికొడ మాజీ ఎమ్మెల్యే

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. సీమలోని రైతులు, ప్రజల దాహార్తి పట్టదా. భావి తరాల కోసం మనందరం పోరాడుదాం. ప్రాజెక్టులను సాధించుకుందాం.

– ఎస్వీ విజయ మనోహరి,

మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద సీమ ప్రజలకు, రైతుల కోసం జగనన్న లిఫ్ట్‌ పనులు ప్రారంభిస్తే వాటిని తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు నిలిపివేసి సీమకు అన్యాయం చేస్తున్నారు. సీమలోని టీడీపీ నాయకులు రాయలసీమ ప్రాజెక్టు సాధనకు కలిసి రాకుంటే పుట్టగతులుండవు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం సాగిస్తాం. – రాజీవ్‌ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయ కర్త

కర్నూలును రాజధానిగా కొనసాగించి ఉంటే బెంగళూరు, చైన్నె తరహాలో అభివృద్ధి సాధించేది. సీమ ప్రాంతాన్ని వైఎస్‌ కుటుంబం తప్ప ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగనన్న ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను ప్రారంభించుకుందాం.గ్రేటర్‌ రాయలసీమ ప్రాంత సమస్యలపై ప్రజలను, రైతులను చైతన్యం చేద్దాం. ఇక సీమ రైతులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

– తలారి రంగయ్య, మాజీ పార్లమెంట్‌ సభ్యులు

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతుంది. రాయలసీమలో భూమి మంచిదే. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో రిజర్వాయర్లు నిర్మించారు. జగనన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీమ రైతుల త్యాగం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను అవమానిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది.

– వంగాల భరత్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

రాయలసీమ లిఫ్ట్‌ పనులు

వెంటనే ప్రారంభించాలి

చంద్రబాబు సీమ ద్రోహిగా

చరిత్రలో నిలిచిపోతారు

అమరావతి జపం చేస్తున్న

టీడీపీ నేతలు

సీమ ప్రాంత అభివృద్ధి

పూర్తిగా విస్మరించారు

కర్నూలులో ‘రాయలసీమ సాగునీటి

ప్రాజెక్టులు–సమాలోచన’ సదస్సు

గళం వినిపించిన

సీమ ప్రాంత ముఖ్య నేతలు

Advertisement
 
Advertisement
Advertisement