వైభవంగా ముగిసిన వసంతోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ముగిసిన వసంతోత్సవాలు

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వసంతోత్సవాలు బుధ వారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర కృష్ణ ఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు పార్టీలో పలు విభాగాలకు సంబంధించి పదవులను కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

● నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం శివనాగిరెడ్డిని స్టేట్‌ ఎంప్లాయీస్‌, పింఛనర్స్‌ వింగ్‌ సెక్రటరీగా, గోపవరం జయప్రకాష్‌ నారాయణరెడ్డిని జిల్లా యూత్‌వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పాణ్యంకు చెందిన జీ సుమంత్‌కుమార్‌రెడ్డిని పార్టీ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌, జీ మధుమోహన్‌రెడ్డిని జిల్లా ట్రెజరర్‌, సద్దల చంద్రశేఖర్‌రెడ్డిని జిల్లా యూత్‌వింగ్‌ జనరల్‌ సెక్రటరీ, బొనిగేని బాలుడును జిల్లా యూత్‌వింగ్‌ సెక్రటరీగా, రోషనాల సంతోష్‌కుమార్‌ను నియోజకవర్గం స్టూడెంట్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది.

● బనగానపల్లెకి చెందిన పేరం సత్యనారాయణరెడ్డిని జిల్లా సెక్రటరీ ఆర్గనైజర్‌, యేరాసి నాగేశ్వరరెడ్డిని జిల్లా యూత్‌వింగ్‌ జనరల్‌ సెక్రటరీ, కొట్టాల వెంకటేశ్వర్లును జిల్లా యూత్‌వింగ్‌ సెక్రటరీ, పీఆర్‌ చిన్నఓబుల్‌రెడ్డిని జిల్లా యూత్‌ వింగ్‌ సెక్రటరీ, కునుకుంట్ల హరి, గురుకంటి అకార్‌బాషాలను జిల్లా యూత్‌ వింగ్‌ ఎక్సిక్యూటీవ్‌ మెంబర్లుగా నియమించింది.

● డోన్‌కు చెందిన ఎద్దుల గజేంద్రనాధ్‌రెడ్డిని జిల్లా యూత్‌ వింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, మధుసూదన్‌రెడ్డిని జిల్లా యూత్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీ, రజనికాంత్‌రెడ్డిని జిల్లా యూత్‌ వింగ్‌సెక్రటరీగా నియమించింది.

● శ్రీశైలంకు చెందిన ఎస్‌ లక్ష్మిరెడ్డిని జిల్లా యూత్‌వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా, వీ నారపరెడ్డిని జిల్లా యూత్‌వింగ్‌ సెక్రటరీ, ఎల్‌ చక్రపాణియాదవ్‌ను, ఎం అల్లాబకాష్‌, సహ్రిఫా రాజ్‌, గుంటి శరత్‌కుమార్‌లను జిల్లా యూత్‌వింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నేటి నుంచి ఎస్‌బీఎం కార్యక్రమాలపై శిక్షణ

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ (గ్రామీణ్‌) కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లాలోని డీడీఓ, డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీఆర్‌సీ ప్రిన్సిపాల్‌, జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలోని అధికారులకు జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో, నంద్యాల జిల్లాకు చెందిన అధికారులకు నంద్యాల మండల పరిషత్‌ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 22, మే 5, 12, 13వ తేదీల్లో డీఎల్‌పీఓ, డీడీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు వివిధ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement