ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని సోగనూరు గ్రామంలో శ్రీమారెమ్మవ్వ, శ్రీసుంకులమ్మవ్వ దేవర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. దేవర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంభాలతో అమ్మవార్ల దేవాలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బంధువులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు.


