ప్రకృతితో మమేకమైతే జీవితంలో సంతోషం విరబూస్తుంది. గొడ్డలితో నరికినా నీడనిస్తూ, ఫలాలను అందిస్తూ చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచడం చెట్లకే చెల్లు. కర్నూలు నగర శివారు, వెంకయపల్లె ఎల్లమ్మకు వెళ్లే దారిలోని చెట్లు(గోల్డెన్ ట్రంపెట్) సరిగ్గా నెల రోజుల క్రితం ఒళ్లంతా పూలతో నవ్వులు చిందించాయి. పసుపు పచ్చని పూలు గాలికి రాలిపడుతూ ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఇవే చెట్లు నేడు పచ్చని ఆకులతో చల్లని నేస్తాలుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
నెల రోజుల క్రితం పువ్వులతో నిండిన చెట్లు
ప్రస్తుతం ఆకుపచ్చని ఆకులతో ఆహ్లాదాన్ని పంచుతూ..


