రూ.1.10 కోట్ల విలువైన
529 సెల్‌ఫోన్లు రికవరీ
కర్నూలు: రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. బాధితులు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్‌ఫోన్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు విడతల్లో రూ.3.70 కోట్ల విలువ చేసే 1,873 సెల్‌ఫోన్లను రికవరీ చేయగా, తాజాగా నాలుగో విడత రూ.1.10 కోట్ల విలువ చేసే 529 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. బాధితులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఎస్పీ చేతుల మీదుగా రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్‌రావు, శివశంకర్, మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు.
మొబైల్ పోగొట్టుకుంటే..
ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీస్ వెబ్‌సైట్ http://kurnoolpolice.in/mobiletheft లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు ఫారం నింపాలి. పేరు, జిల్లా, పోలీస్‌స్టేషన్ పరిధి, మొబైల్‌కు సంబంధించిన ఐఎంఈఐ–1, ఐఎంఈఐ–2 నెంబర్లతో పాటు బిల్లులు ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరిస్తే సాంకేతికత ఆధారంగా ట్రాక్ చేసి ఎక్కడుందో పోలీసులు గుర్తిస్తారు.


