ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీకి ఈర న్న, ఉష దంపతుల నాలుగేళ్ల కుమారుడు హన్విత్ ఇంటి దగ్గర ఆడుకుంటూ గోలిని మింగేశాడు. అది గొంతులో చిక్కుకుని నొప్పి వస్తూ గాలి తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని చూసి వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు ప్రసూన వెంటనే బాలుడి పరిస్థితిని చూసి ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల సమయంలోనే శస్త్ర చికిత్స లేకుండా, కుట్లు, కోతలు లేకుండా గోలిని సులభంగా బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలియజేశారు.


