అందరికీ ఆదర్శం అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

అందరికీ ఆదర్శం అంబేడ్కర్‌

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

సాక్షి, నంద్యాల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అంబేడ్కర్‌ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంత్యుత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నంద్యాలలో అంబేడ్కర్‌ భవనం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ చిన్నతనంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ, ఉన్నత విద్యను సాధించి గొప్ప స్థాయికి ఎదిగారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్‌, పలు సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, లింగుస్వామి, దండు వీరయ్య, డీవీఎంసీ సభ్యులు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement