కోటకొండ కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

కోటకొండ కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు

Apr 14 2026 8:22 AM | Updated on Apr 14 2026 8:22 AM

కోటకొండ కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు

రుద్రవరం: కోటకొండ గ్రామ సమీపంలోని కుంటలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.గత రెండు రోజుల నుంచి రాత్రి సమయాల్లో జేసీబీలతో తవ్వి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ కుంటలో మట్టి తవ్వకాలు సాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలో ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వడం వల్ల వర్షాలు కురిసినప్పుడు నీరు కుంటకు ఉన్న తూముల వైపు రాకుండా ఆ గుంతల్లోనే ఉండి పోతుందని వాపోయా రు. అలా తూముల ద్వారా నీరు అందక పోతే దిగువన ఉన్న ఆయకట్టు పొలాలకు నీరు పారక పంటలు పండించుకోలేక పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుంటలో మట్టి తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు కోరారు. వీఆర్వో గురుస్వామిని వివరణ అడగ్గా కుంటలో మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement