● ఉమ్మడి జిల్లాలో 15 మందికి స్థానచలనం ● వీఆర్‌లో ఉన్న ఇద్దరికి పోస్టింగులు
బదిలీ అయిన సీఐలు
కర్నూలు: రాయలసీమ జోన్ కర్నూలు, అనంతపురం రేంజ్‌ల పరిధిలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 25 మంది సీఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఇందులో ఒకరు సత్యసాయి, మరొకరు వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. అలాగే అనంతపురం రేంజ్‌లో వీఆర్‌లో ఉన్న ఒకరికి చెన్నూరు యూపీఎస్, కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న మరొకరిని మంత్రాలయం పీఎస్‌కు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో ఉన్న మరో ఇద్దరు అనంతపురం రేంజ్‌కి బదిలీ అయ్యారు.
పేరు ప్రస్తుత సర్కిల్ బదిలీ అయిన సర్కిల్
జి.వి.నాగరాజరావు కర్నూలు టూటౌన్ ఆళ్లగడ్డ యూపీఎస్
ఎం.శ్రీధర్ ఫ్యాక్షన్ జోన్, కర్నూలు కర్నూలు టూటౌన్
ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ యూపీఎస్ కౌతాళం యూపీఎస్
ఎన్.అశోక్ కుమార్ కౌతాళం యూపీఎస్ నందికొట్కూరు
వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సోషల్ మీడియా అండ్
సైబర్ క్రైం సెల్, కర్నూలు
డి.మస్తాన్ వలి సోషల్ మీడియా అండ్ సీసీఎస్–2,
సైబర్ క్రైం సెల్, కర్నూలు కర్నూలు
కె.శ్రీనివాస నాయక్ సీసీఎస్–2, కర్నూలు ఆస్పరి, కర్నూలు
దస్తగిరి బాబు వీఆర్, కర్నూలు మంత్రాలయం
పి.రామాంజులు మంత్రాలయం పులివెందుల ట్రాఫిక్
వి.సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ డీటీసీ, నంద్యాల
డి.హాజీవలి డీటీసీ, నంద్యాల సీసీఎస్,వైఎస్సార్ కడప
జి.మారుతి శంకర్ కొత్తచెరువు,
సత్యసాయి జిల్లా కర్నూలు వన్‌టౌన్
ఎం.పార్థసారధి కర్నూలు వన్‌టౌన్ ఫ్యాక్షన్‌జోన్, కర్నూలు
ఎ.గంగాధర్ వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం
కె.ఉలసయ్య వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం


