సంజామల మండలంలో
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై బానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నెల 12న నంద్యాల జిల్లాలో గరిష్టంగా 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం సంజామలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంజామల మండలంలో కావడం గమనార్హం. ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీలు, కోవెలకుంట్లలో 43.3, ఉయ్యలవాడలో 43.3, గూడూరులో 43, బనగానపల్లిలో 42.8, కర్నూలులో 42.8, కోడుమూరులో 42.7, గోస్పాడులో 42.7, నంద్యాల రూరల్‌లో 42.7, పాణ్యంలో 42.6, మంత్రాలయంలో 42.5, చాగలమర్రిలో 42.5, కొలిమిగుండ్లలో 42.4, రుద్రవరంలో 42.4, కొలిమిగుండ్లలో 42.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతోది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటం ఆందోళన కలిగిస్తోంది.
వడదెబ్బతో వృద్ధుడు మృతి
పగిడ్యాల: నెహ్రూనగర్‌లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కొంతలపాడు నాగన్న(70) ఆదివారం నీటి మునక పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతకు సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. స్థానిక ఆర్‌ఎంపీని ఇంటికి పిలిపించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా అప్పటికే మరణించాడన్నారు.
44 డిగ్రీల ఉష్ణోగ్రత


