నంద్యాల: ప్రజలు అందజేసిన వినతులను చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని....
● ఆస్తి తీసుకుని తమ యోగక్షేమాలు చూడటం లేద ని ఆత్మకూరులోని ఇందిరానగర్‌కు చెందిన యోహాన్, అంకమ్మ ఎస్పీ ఎదుట వాపోయారు.
● చేతబడులు చేసే ఆత్మకూరుకు చెందిన షేక్. నజురున్ భారీ మొత్తంలో బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోసం చేసిందని, మీరు స్పందించి న్యాయం చేయాలని ఓ మహిళ ఎస్పీకి విన్నవించారు.
● ట్రాక్టర్ ఇంజన్‌ను రిపేర్ కోసం ఆటోనగర్‌లో వీరేష్ అనే వ్యక్తికి ఇస్తే, అతను వేరే వాళ్లకు అమ్మివేసి కనిపించకుండపోయాడని గడివేముల మండలం కొరటమద్దికి చెందిన లక్మీరామిరెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు.


