శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 14 2026 8:22 AM | Updated on Apr 14 2026 8:22 AM

శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలో టోల్‌గేట్‌ దాటిన తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై ఉన్న నో ఎంట్రీ గేట్‌ రాడ్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని పటాన్‌ చెరువు మండలం ఇస్నాపూర్‌ గ్రామానికి చెందిన 9 మంది శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కారులు బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో శ్రీశైలం టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్నారు.గేట్‌ దాటిన తర్వాత యూటర్న్‌ తీసుకునే క్రమంలో కారు అదుపుతప్పి వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న నో ఎంట్రీ చెక్‌ పోస్ట్‌ రాడ్‌ను బలంగా ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న మల్లమ్మ (50), మంజుల, జగదీష్‌, సాయి కార్తీక్‌ అనే నలుగురికి బలమైన కాయాలు కాగా ప్రవీణ్‌ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించగా మల్లమ్మ ప్రాణాలు వదిలింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, దేవస్థానం సీఎస్‌ఓ శ్రీనివాసరావు వైద్యశాలకు చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ఒకరు మృతి

నలుగురికి తీవ్ర గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement