పోలీసు వ్యవస్థలో కోర్టు కానిస్టేబుళ్లుది కీలక పాత్ర
● ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: పోలీసు వ్యవస్థలో కోర్టు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్షాలు సమయానికి కోర్టులకు చేరేలా క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ముఖ్యమైన కేసుల్లో అభియోగపత్రాలు సమయానికి దాఖలు చేయడం అత్యంత ముఖ్యమన్నారు. సీసీ నంబర్ల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కోర్టు సమన్లు, బెయిలబుల్ వారెంట్ల అమలు విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా కోర్టు ఆదేశాల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ జీవన్ గంగనాథ్ బాబు, ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్‌స్పెక్టర్ భరత్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, కోర్టు లైసనింగ్ అధికారులు పాల్గొన్నారు.


