శ్రీమఠంలో భక్తుల రద్దీ
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం, ఆదివారం కలసి రావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక భక్తులు భారీగా వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. కల్పతరు క్యూలైన్ వద్ద శనివారం ఎండ ఎక్కువ ఉండటంతో భక్తులకు కొద్దిపాటి ఇబ్బంది నెలకొంది.
– మంత్రాలయం రూరల్
శ్రీమఠం కారిడార్‌లో భక్తుల కోలహలం


