శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని మూడో శనివారం పలు రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైల మహాక్షేత్రానికి తరలివచ్చి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉభయ సంధ్యావేళల్లో దీపారాధన చేసి ప్రత్యేక నోములు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు ఆకాశదీపాన్ని వెలిగించారు. గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాడవీఽధిలో ఉసిరి చెట్ల కింద పలువురు భక్తుల దీపారాధన చేశారు.
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిరాశాజనకం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిరాశజనకంగా ఉంటున్నాయి. ఉల్లి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, సజ్జలు, సోయాబీన్స్ పంటలకు అంతంతమాత్రం ధరలు లభించడంతో రైతులు నష్టాలను మూటకట్టుకుంటున్నారు.
● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్‌లో కనిష్టంగా రూ.1,470, గరిష్టంగా రూ.1,749 ధర లభించింది.
● ఉల్లిగడ్డలకు కనిష్ట ధర రూ.206, గరిష్ట ధర రూ.1129 పలికింది. గరిష్ట ధర ఒకటి, రెండు లాట్లకు మాత్రమే లభిస్తోంది.
● జిల్లాలో సజ్జ ప్రధాన పంట. మార్కెట్‌లో సజ్జలకు కనిష్టంగా రూ.1,972, గరిష్టంగా రూ.2,101 మాత్రమే లభించింది. మద్దతు ధర రూ.2,775.
● వేరుశనగకు కనిష్ట ధర రూ.3,222, గరిష్ట ధర రూ.6,800 లభించిది. సగటు ధర రూ.5,571 మాత్రమే నమోదైంది. మద్దతు ధర మాత్రం రూ.7,263లు ఉండటం గమనార్హం.
కర్నూలు(అర్బన్): నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన (ఆదివారం) కార్తీక వనభోజన కార్య క్రమాలు నిర్వహిస్తున్న ట్లు సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులోని ఎన్‌ఆర్ పేట సంకల్‌భాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం (హరి హర క్షేత్రం )లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం ఉసిరిక చెట్టుకు పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. బ్రాహ్మణులు అందరూ వనభోజనానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
శ్రీశైలంలో ప్రత్యేక పూజలు


