
పీహెచ్‌సీ డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు ఎన్నికలు
గోస్పాడు: జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల శాశ్వ త సంఘం ఏర్పాటుకు ఎన్నికలు జరగనున్నట్లు అడహక్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అడహక్ కమిటీ ద్వారా డాక్టర్ల సంఘం నిర్వహణ కొనసాగిందన్నారు. ఇప్పటి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ఏపీపీహెచ్‌ఈడీఏ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తామనానరు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు విన్నవించగా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలితను నియమించారన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియామకం పొందిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలితను కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఈనెల 25న ప్రారంభమైందని, 27వ తేదీ మధ్యా హ్నం 2గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, అనంతరం అదే రోజు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.