
అర్హులకు పదోన్నతి కల్పించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను ప్రభుత్వం మాతృశాఖలకు అప్పగించి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. విభాగాల వారిగా సీనియారిటీ ఉద్యోగుల జాబితాను విడుదల చేసి పదోన్నతి కల్పించటంతో పాటు విధి విధానాలననుసరించి పారదర్శకంగా బదిలీలు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వాటితో పాటు ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలి.
– గురుస్వామి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌గా అమలవుతున్న విధానాన్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు మార్పు చేయాలి. అలాగే ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్‌లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 1.25 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమాలను ప్రతి ఇంటికి చేర్చటంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటింటికి తిరిగి సర్వేలు నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతున్నాయి.
– మధుసూదన్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల
సంఘం అధ్యక్షులు, నంద్యాల
ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు, ఇతర పనుల నుంచి సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం విముక్తి కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తాం. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖకు అప్పగించటంతో పాటు విభాగాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేసి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. ఉద్యోగులందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
– సంపత్‌కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, నంద్యాల

అర్హులకు పదోన్నతి కల్పించాలి

అర్హులకు పదోన్నతి కల్పించాలి