
న్యాయమూర్తులకు అవగాహన సదస్సు
కర్నూలు: ‘నేరారోపణల రిమాండ్, జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టం–జాగ్రత్త’ అనే అంశంపై న్యాయమూర్తులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అధ్యక్షతన శనివారం జరిగిన అవగాహన సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, శోభారాణి, రాజేంద్రబాబు, హరినాథ్‌తో పాటు జిల్లాలోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు.