
16 నెలల్లో ఒక్క హామీ అమలు కాలేదు
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకు లు హృదయరాజు అన్నారు. ఆదివారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమ స్యలపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ అమలుకు ఆర్థిక శాఖలో నాలుగు సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయు లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న కనీస వేతన స్కేల్ అమలు చేయడం లేదని అన్నారు. సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు పీవీ ప్రసాద్, మౌలాలి, నగరి శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యం, కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేంద్రనాథ్, శివరాంప్రసాద్, సాంబశివుడు, అజాంబేగ్, లింగమయ్య, నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.