
సేవల అంతరాయానికి ప్రభుత్వానిదే బాధ్యత
ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం. వైద్య సేవల్లో అంత రాయం కలగడంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. 30న జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా స్థాయి వైద్యుల నిరసన, 1న జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, నిరసన ర్యాలీ, 2న చలో విజయవాడకు పిలుపునిచ్చాం.
– డాక్టర్ అంకిరెడ్డి, పీహెచ్‌సీ వైద్యుల శాశ్వత సంఘం జిల్లా అధ్యక్షుడు