
కార్యకర్తలకు వైఎస్ జగన్ అండ ..
రాష్ట్రంలోని పేదలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా వైఎస్ జగన్ చూస్తూ ఊరుకోరని, వారి కుటుంబాలకు ఆదుకుని తీరుతారన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే డిజిటల్ బుక్‌లో వారి వివరాలను నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారం చేపడితే ఇబ్బందులకు గురిచేసిన వారి భరతం పట్టడం ఖాయ మన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మాట మీద నిలబడి ఎలా నెరవేర్చారో, అలాగే డిజిటల్‌బుక్ ద్వారా తప్పకుండా కార్యకర్తలకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కార్యకర్తలు తప్పకుండా డిజిటల్‌బుక్‌ను సద్వినియోగం చేసుకుని తీరాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రమార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉమెన్‌వింగ్ ఉపాధ్యక్షురాలు శశికళారెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు రసూల్ ఆజాద్, దేవనగర్‌బాషా, అనీల్ అమృతరాజ్, టైలర్ శివయ్య, రామచంద్రుడు, నాయకులు నెరవాటి సత్యనారాయణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.