
అధికార పార్టీ నేతలకు ఉద్యోగులు తలొగ్గొద్దు
బొమ్మలసత్రం: అధికారపార్టీ నేతల మాటలు విని కొందరు అధికారులు, ఉద్యోగులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ధన, మాన, ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని, నేతలకు అధికారులు తలవంచాల్సిన అవసరం లేదని నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి చంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో కార్యకర్తల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వైఎస్సార్‌సీపీ డిజిటల్‌బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను మాజీ ఎమ్యెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పార్టీ నేతలు ఆవిష్కరించారు. అధికారపార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు అధికారులను తొత్తులుగా మార్చుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మారుమూల ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్‌బుక్ ద్వారా అండగా నిలుస్తామన్నారు. కార్యకర్తకు అన్యాయం చేసిన అధికారి పేరు, అధికార పార్టీ నాయకుడి పేరు తదితర అంశాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి బలైన వారిని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించి తమ కార్యకర్తల కుటుంబాలకు అన్యాయం చేస్తే ఎక్కడ ఉన్నా నడిరోడ్డుపై నిలబెట్టి ప్రశ్నిస్తామన్నారు.
పేదలకు అన్యాయం చేస్తే
వదిలే ప్రసక్తే లేదు
కార్యకర్తలకు అండగా నిలించేందుకు
‘డిజిటల్ బుక్’
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి,
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా