
పేకాట రాయుళ్ల అరెస్టు
పాములపాడు : బానకచర్ల గ్రామం సమీపంలోని నల్లమల అడవిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 18 మందిలో 11 మ ంది పరారుకాగా ఏడుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 62,400 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు టౌన్‌కు చెందిన మల్లికార్జున, ఇస్కాల పెద్ద మదిలేటి, పాములపాడు గంగాధర్ రెడ్డి, బండి ఆత్మకూరు సత్యనారాయణ, పెద్ద దేవలాపురం సుబ్బరాయుడు, ఎర్ర గుడూరు శ్రీరాములు , వెలుగోడు శివన్న పట్టుబడిన వారిలో ఉన్నట్లు ఎస్‌ఐ సురేష్ బాబు తెలిపారు. ముందస్తు సమాచారంతో ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు.