ఆర్భాటాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు
డోన్: సంపద సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆడంబరా లు, ఆర్భాటాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం చిన్న మల్కాపురంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త దొంతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటిలో పాత్రికేయులతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కడా కూడా అమలు చేయకుండా ఏడాది కాలంగా ప్రజలను మభ్యపెడుతున్న ఘన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి నేతలు ఏడాదిగా రాష్ట్రమంతట హెలికాప్టర్లలో గాలికి తిరుగుతూ ప్రజా ధననాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అనంతరం ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చకుండానే ఏడాది కాలంలోనే రూ. లక్షల కోట్ల అప్పు చేయడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందన్నారు.
పోరాటాలకు సిద్ధం కండి
రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు బుగ్గన పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, దాడు లు ప్రజాస్వామ్య పరిరక్షణకు విఘాతం కల్గిస్తాయన్నారు. రాబో యే కాలంలో కూటమి ప్రభుత్వం ఆరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు నడిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్యాయంగా అమాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అధికారంలో స్థిరంగా ఉండాలనుకోవడం భ్రమ అన్న సంగతిని కూటమి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు గోపాల్‌రెడ్డి, మాహానందరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, మల్లికార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిగా సంక్షేమం, అభివృద్ధి లేదు
సంపద సృష్టి అంటూ కూటమి నేతలు
హెలికాప్టర్లలో పర్యటనలు
డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకే చెల్లు
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి


