స్పందనలో 120 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

స్పందనలో 120 ఫిర్యాదులు

Mar 28 2023 1:04 AM | Updated on Mar 28 2023 1:04 AM

- - Sakshi

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 120 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్పందనలో అర్జీదారుల సమస్యలకు నేరుగా పరిష్కారం చూపామని మరికొన్ని ఫిర్యాదులను ఆయా స్టేషన్‌ అధికారులకు రెఫర్‌ చేశామన్నారు. వినతుల్లో అధికంగా ఆస్తి తగాదా లు, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు తదితర సమస్యలు ఉన్నాయన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రమణ, ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీ రామాంజినాయక్‌ పాల్గొన్నారు.

మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.32.74 లక్షలు

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల హుండీ లెక్కింపు నిర్వహించారు. 42 రోజులకు సంబంధించిన హుండీ లెక్కించగా రూ.39,80.602 లక్షలు, 95 గ్రాముల బంగారు, 2.400 కేజీల వెండి వచ్చింది. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో ఈఓ పాండు రంగారెడ్డి, చైర్మన్‌ సీతారామ చంద్రుడు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యు లు లక్ష్మి నాయుడు, సుశీల, రామసుబ్బమ్మ, తిమ్మారెడ్డి, లక్ష్మీదేవి, మద్దిలేటి స్వామి, కృష్ణారెడ్డి, ఈశ్వర్‌రె డ్డి, వేదపండితులు కళ్యాణ్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

డీఎడ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 24 ఆఖరు

కర్నూలు సిటీ: జిల్లాలో 2015–17, 2018–20 డీఎడ్‌ బ్యాచ్‌లకు చెందిన స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులు సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు వచ్చే నెల 24వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని డీఈఓ వెంకట రంగారెడ్డి సోమవారం తెలిపా రు. రూ.50 జరిమానాతో వచ్చే నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ. 175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు.

రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు(అర్బన్‌): జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, భూగర్భ జలవనరుల శాఖ, గృహ నిర్మాణం, పశుసంవర్థక శాఖలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరుకానున్నారని తెలిపారు.

4న అరుణాచలానికి ‘ఇంద్ర’

కర్నూలు(రాజ్‌విహార్‌): గిరి ప్రదక్షిణ దీపోత్సవం సందర్భంగా తమిళనాడులోని అరుణాచల క్షేత్రం దర్శనానికి ఏప్రిల్‌ 4న ఇంద్ర ఏసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు కర్నూలు–2డిపో మేనేజర్‌ సర్దార్‌ హుసేన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 8గంటలకు కర్నూలు నుంచి ఈ బస్సు బయలుదేరి, బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందన్నారు.

వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి
1
1/1

వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement