ఇంప్లాంట్స్‌లో గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

ఇంప్లాంట్స్‌లో గోల్‌మాల్‌!

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

పర్చేజింగ్‌ కమిటీదే తుది నిర్ణయం

నల్లగొండ టౌన్‌ : నల్లగొండలోని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)కి ఆర్థోపెడిక్‌ శస్త్ర చికిత్సల కోసం అవసరమైన వివిధ రకాల ఇంప్లాంట్స్‌ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి ఇంప్లాంట్స్‌ సరఫరా కోసం అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి జిల్లా పర్చేజింగ్‌ కమిటీ నెలరోజుల క్రితం టెండర్లు ఆహ్వానించింది. వాస్తవానికి ఆ టెండర్లను ఇ–ప్రొక్రూర్‌మెంట్‌ పద్ధతిని నిర్వహించాల్సి ఉండగా అధికారులు మాన్యువల్‌గా నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియలో సుమారు నలుగురు ఽకాంట్రాక్టర్లు తమ టెండర్‌ ఫారాల్లో తమ ధరలు కోట్‌ చేసి సమర్పించారు. పది రోజుల క్రితం టెండర్లను తెరిచిన అధికారులు తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు ఇంప్లాంట్స్‌ సరఫరాకు ఆర్డర్స్‌ను అందించాల్సి ఉన్నా.. నేటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో టెండర్లలో ఏదో గోల్‌మాల్‌ జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగా ఆస్పత్రికి సకాలంలో ఇంప్లాంట్స్‌ సరఫరా లేకపోవడం వల్ల ఆర్థోపెడిక్‌ శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ

ఒత్తిళ్లతోనే జాప్యం

ఇంప్లాంట్స్‌ సరఫరా కోసం పిలిచిన టెండర్లకు రాజకీయ రంగు పులుముకుంది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా కాంట్రాక్టర్లకు కాదని ఇప్పటి వరకు ఇంప్లాంట్స్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే తిరిగి అప్పగించాలని అధికార పార్టీ నేతలు..అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి అర్హులైన కాంట్రాక్టర్‌కు ఇంప్లాంట్స్‌ సరఫరాకు ఆర్డర్స్‌ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ టెండర్లు పూర్తయి నెల రోజులు

ఫ నేటికీ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయని జిల్లా పర్చేజింగ్‌ కమిటీ

ఫ పాత కాంట్రాక్టర్‌కే ఇవ్వాలని అధికార పార్టీ నేతల ఒత్తిడి

ఫ నల్లగొండ జీజీహెచ్‌కి నిలిచిన ఇంప్లాంట్స్‌ సరఫరా

ఫ ఇబ్బందుల్లో ఆర్థోపెడిక్‌ రోగులు

ఇంప్లాంట్స్‌ సరఫరాకు కాంట్రాక్టర్‌ ఎంపిక విషయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా పర్చేజింగ్‌ కమిటీదే తుది నిర్ణయం. ఎంపికలో మా ప్రమేయం ఏమి ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కమిటీ ఎంపిక చేస్తుంది.

– డాక్టర్‌ గుర్రం నర్సింహారావు నేత,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement