విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

మునుగోడు : రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషిచేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలం పులిపలుపుల ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.25వేల నుంచి రూ. 15వేల నగదు ప్రోత్సాహకాలు అందిస్తానన్నారు. మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డిపై కొట్లాడి బి.వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చి పూర్తిచేసి ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డితో నీటిని నింపితే ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. త్వరలో మునుగోడు మండలంలోని కాల్వలు తవ్వించి సాగు నీరు పారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దోటి నారాయణ, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌, పాఠశాల హెచ్‌ఎం కళావతి, సర్పంచ్‌లు కమ్మంపాటి జ్యోతి వెంకటేష్‌, దాసరి గోవర్ధన్‌, ఉపాధ్యాయులు యూసుఫ్‌పాషా, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement