రామగిరి (నల్లగొండ) : పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి పురుషోత్తంరావు అన్నారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన న్యాయసేవా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తామన్నారు. లోక్ అదాలత్ నిర్వహిచడం వివాదాలను పరిష్కరించవచ్చన్నారు. న్యాయ సహాయం అవసరం ఉన్న వాళ్లు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌లో సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంతరెడ్డి, ఎన్.భీమార్జున్‌రెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి, ఎం.లెనిన్ బాబు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
సమాజంలో విలువలను పరిరక్షించేది సాహిత్యం
రామగిరి (నల్లగొండ) : సమాజంలో విలువలను పరిరక్షించేదే సాహిత్యమని సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సాహిత్యం అభ్యుదయ సమాజాన్ని కాంక్షించేలా ఉండాలన్నారు. పాఠశాల స్థాయి పిల్లలనుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు తెలంగాణ సాహిత్య సమావేశంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రంథాలయ ఉద్యమకారుడుగా, పుస్తక ప్రచురణ కర్తగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా వట్టికోట ఆల్వార్ స్వామి కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు మునాస్ వెంకట్, బెల్లి యాదయ్య, తండు కృష్ణకౌండిన్య, కుకుడాల గోవర్ధన్, చొల్లేటి ప్రభాకర్, కృష్ణమాచార్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నకిరేకల్ : అంగన్‌వాడీ టీచర్స్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం నకిరేకల్‌లో జరిగిన జిల్లా మహాసభలో ఎనుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా పొడిచేటి నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.పార్వతి రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఇంద్రవల్లి సైదమ్మ, దాడి అరుణ, మణెమ్మ, ఎల్.రాజు, సహాయ కార్యదర్శులుగా సముద్రమ్మ, పద్మ, ఫాతిమా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అవుట రవీందర్, ప్రచార కార్యదర్శిగా సుభాషిని, కోశాధికారిగా సునంద, సోషల్ మీడియా కన్వీనర్‌గా రషీదా, జిల్లా కమిటీ సభ్యులుగా చంద్రమ్మ, ఎల్లమ్మ, లలిత, రాధాబాయి, అప్పనబోయిన మంగమ్మ, కృష్ణవేణి, అండాలు, కల్యాణి, యాద మ్మ, పరిపూర్ణమ్మ, శ్రీదేవిలు ఎన్నికయ్యారు.
శ్రీనృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్యన ఊరేగించారు.
పొడిచేటి నాగమణి, జిల్లా అధ్యక్షురాలు
పార్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం


