సెయింట్ ఆల్ఫోన్సస్‌లో సాంస్కృతిక సందడి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాలలో మోలిక్యూల్ ఫెస్ట్ సందర్భంగా ఆదివారం విద్యార్థుల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి. మూడు రోజులు గా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు కార్యక్రమానికి హై కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. నాటి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ రమేష్, ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ హృదయ్‌కుమార్‌రెడ్డి, శాజన్ ఆంథోని, షైని అలెక్స్, విన్సెంట్‌రెడ్డి, సంతోష్‌కుమార్, బాల ఇన్నా, సెబాస్టియన్, వినోద్‌రెడ్డి, శ్యాంపాల్‌రెడ్డి, సీతారాంగోరే, విజయకుమార్‌రెడ్డి, బాలశౌరిరెడ్డి పాల్గొన్నారు.
సెయింట్ ఆల్ఫోన్సస్‌లో సాంస్కృతిక సందడి


