
సాగర్ క్రస్ట్‌గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశ యం రేడియల్ క్రస్ట్‌గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. గత నెలలోనే క్రస్ట్ గేట్లకు సీల్స్ వేయడం బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్ పనులు చేస్తున్నారు. ఒక్కోగేటు పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేశామని, ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్ల పనులు ముమ్మరం చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు.