రావి నారాయణరెడ్డి యాదిలో.. | - | Sakshi
Sakshi News home page

రావి నారాయణరెడ్డి యాదిలో..

Dec 3 2023 1:30 AM | Updated on Dec 3 2023 1:30 AM

రావి నారాయణరెడ్డి సేవా సంస్థ నూతన కార్యవర్గం సభ్యులు  - Sakshi

రావి నారాయణరెడ్డి సేవా సంస్థ నూతన కార్యవర్గం సభ్యులు

భువనగిరి రూరల్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ‘రావి నారాయణరెడ్డి యాదిలో’ పేరుతో శనివారం భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో గ్రామస్తులతో పాటు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి నివసించిన ఇంటి ముందు జరిగిన సమావేశంలో ఆయన గొప్పతనం గురించి నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకు రావి నారాయణరెడ్డి సేవా సంస్థ ఏర్పాటు చేయాలని, బొల్లేపల్లి మరియు జిల్లా కేంద్రంలో రావి నారాయణరెడ్డి కాంస్య విగ్రహాలతో పాటు ట్యాంక్‌ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. నారాయణరెడ్డి కట్టించిన ప్రైమరీ స్కూల్‌, హైస్కూల్‌ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మించేలా ప్రభుత్వానికి విన్నవించాలని అన్నారు. ప్రతి యేటా ఆయన జయంతి రోజున విద్యార్థులను సన్మానించాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

సేవా సంస్థ ఏర్పాటు..

ఈ సందర్భంగా రావి నారాయణరెడ్డి సేవా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెరుకుపల్లి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా పడాల భాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా రావి సుకేష్‌రెడ్డి, కోశాధాకారిగా తిరుమణిదాసు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి రావి హేమంత్‌రెడ్డి, సభ్యులుగా కత్రోజు విజయకుమార్‌, చెరుకుపల్లి మహేశ్‌, డాక్టర్‌ గడ్డం విజయభార్గవ్‌, ముఖ్య సలహాదారుడిగా భువనగిరి సత్యనారాయణ, సలహాదారులుగా రావి ప్రతిభ, రావి ప్రభాకర్‌రెడ్డి, మద్ది బుచ్చిరెడ్డిని ఎన్నుకున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement