రోడ్డు వెంట చెత్త కుప్పలు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనం ఇస్తోంది. కొంత మంది వ్యాపారులు చెత్త సేకరణ చేసే ఆటోలు, ట్రాక్టర్లలో వేయకుండా రోడ్లపైనే పడవేస్తున్నారు. ఇక ఈదులగూడెం, రామచంద్రగూడెం, విద్యానగర్‌లో రోడ్లపైనే పశువులను కట్టేయడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. మొత్తం 278 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ 50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో ఇటీవల రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.


