నేడు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి –2026 ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను గురువారం ఎంపిక చేయనున్నట్లు ఎంజీ యూనివర్సిటీ జాతీయ సమన్వయకర్త మారం వెంకటరమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో వలంటీర్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్, హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాల్లో ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ నుంచి పలువురు
బీఆర్‌ఎస్‌లో చేరిక
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జి రేబెల్లి రోహిత్‌పాటు మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్దార్ధ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పద్మశెట్టి కోటేశ్వర్‌రావు, పిన్నబోయిన శ్రీనివాస్‌యదవ్, లింగంపల్లి చిరంజీవి, ఎండీ.షోయబ్, పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, సత్యనారాయణ, నాగభూషణం, దినేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన త్యాగరాజ కీర్తనలు
రామగిరి(నల్లగొండ): త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను నల్లగొండ పట్టణంలోని రామాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన త్యాగరాజ స్వామి కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. పి.రవిశంకర్, ఎన్‌సి.పద్మ, జానకిరామనాథన్, గోవర్ధనం మానస, ఎన్‌వి.జానకి, గరిమెళ్ల శ్వేత కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎం.జనార్దనాచార్య, ఎంపీ.ఆచార్యచారి, చకిలం వేణుగోపాల్‌రావు, ముడుంబ లక్ష్మినాథ్, అనంతాచార్యులు, అక్కినేపల్లి శ్రీనివాసరావు, ప్రసాదరావు, రమాదేవి, జానకి పాల్గొన్నారు.
నేడు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ఎంపిక


