పట్టణాలు అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం
చండూరు : చండూరు మున్సిపాలిటీలో చెత్త నిర్వాహణ వ్యవస్థ సరిగాలేదు. చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 2 ఆటోలు ఉన్నాయి. మెత్తం 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజు విడిచి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. చెత్తను శిర్ధేపల్లి రోడ్డులోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసేందుకు, కంపోస్ట్ ఎరువు తయారీకి షెడ్లు నిర్మించారు. కానీ వాటిని నిరుపయోగంగా వదిలేశారు.
ఫ అంతటా రోజువిడిచి రోజు చెత్త సేకరణ
ఫ అయినా చాలా చోట్ల వీధుల్లో దర్శనమిస్తున్న చెత్తాచెదారం
ఫ నల్లగొండ డంపింగ్ యార్డులోనే రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం
ఫ మిగతా చోట్ల చెత్తకు నిప్పు పెడుతున్న సిబ్బంది
ఫ పొగ, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ 20 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ట్రాలీ ఆటోలు వినియోగిస్తున్నారు. సిబ్బంది 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజూ టన్ను పైనే చెత్తను డంపింగ్ యార్డు తరిస్తున్నారు. నెల్లిబండ–నోముల శివారులోని డంపింగ్ యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. డంపింగ్ యార్డులో పారబోసి నిప్పుపెడుతుండటంతో పొగ, దూమ్ముతో పంట పొలాలు దెబ్బతినండంతో పాటు, పశువు గ్రాసం కూడా కాలిపోతోందని రైతులు వాపోతున్నారు.
హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులకు గానే ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 7 టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 51 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు విడిచి రోజు చెత్త సేకరణ సేకరిస్తుండడంతో వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. డంపింగ్ యార్డు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండటమే చెత్త సేకరణకు ప్రధాన సమస్యగా మారింది.
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో రోజుకు 10 టన్నులకు పైగానే చెత్తను సేకరించి శివనేనిగూడెం రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్‌యార్డు 1వ వార్డుకు సమీపంలో ఉండటంతో పొగతో, దుర్వాసనతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామం వెంకటాపురం(ఆరవ వార్డు)లో చెత్తను సేకరించి ఆ వార్డు శివారులోని గుంతలో పారబోస్తున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం సమస్య వేధిస్తుంది.
పట్టణాలు అపరిశుభ్రం
పట్టణాలు అపరిశుభ్రం
పట్టణాలు అపరిశుభ్రం
పట్టణాలు అపరిశుభ్రం


