మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
ఫ మాజీ మంత్రి కేటీఆర్
చిట్యాల : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగే కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో చిట్యాలలో ఆయన కాసేపు ఆగారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కారులోంచి పార్టీ నాయకులకు అభివాదం చేస్తూ పార్టీ గెలుపుకోసం కష్టించి పనిచేయాలని సూచించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, పార్టీ మండల ప్రధానకార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మెండె సైదులు, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేష్, బొబ్బల శివశంకర్‌రెడ్డి, కందాటి రమేష్‌రెడ్డి, కొలను సతీష్, బోయపల్లి శ్రీను, అర్రూరి శ్రీశైలం, రాచకొండ క్రిష్టయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, బొంతల రామక్రిష్ణారెడ్డి, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


