అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
నల్లగొండ : రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కారం చూపాలన్నారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా.. ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటివరకు 61 శాతం పూర్తయిందని.. దీన్ని 75 శాతానికి తీసుకెళ్లేందుకు నిత్యం బీఎల్‌ఓలతో సమీక్షించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేవంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, అదికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


