దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు..! | Sakshi
Sakshi News home page

దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు..!

Published Thu, Nov 16 2023 6:06 AM

- - Sakshi

యాదగిరిగుట్ట రూరల్‌: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్ట మండలంలోని రాళ్లజనగాం గ్రామంలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన పలువురు భూ నిర్వాసితులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా తాము కోల్పోయిన భూములకు తక్కువ నష్టపరిహారం వచ్చిందని, సరైన న్యాయం జరగలేదని వాపోయారు. దీనిపై సునీత మాట్లాడుతూ.. తాను రాళ్లజనగాం గ్రామం రిజర్వాయర్‌లో పోకుండా సాధ్యమైన రీతిలో కృషిచేశానని, తాను ఓటును అభ్యర్థించడానికి వచ్చానని, ఇష్టముంటే ఓట్లు వేయండి, లేదంటే లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ప్రచార వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement