అద్దె బస్సుల పథకం మహిళా సభ్యులకు వరం లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా వివిధ పథకాల కింద మమ్మల్ని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నాం. ఇక బస్సును మా పేరిట రిజిస్ట్రేషన్ చేసి యజమానులుగా మార్చడం ఎంతో బలం చేకూర్చింది. అద్దె రూపంలో వస్తున్న డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– వరలక్ష్మి, అధ్యక్షురాలు, మండల
మహిళా సమాఖ్య, మహమ్మదాబాద్


