ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం

Oct 8 2026 3:42 AM | Updated on Oct 8 2026 3:42 AM

కందనూలు: స్థానిక ఆర్టీసీ డిపోలోని ప్రతి ఉద్యోగి ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ తరఫున ఆర్టీసీ డిపో వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్‌ బకాయిల చెల్లింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిపో చైర్మన్‌ పరుశరాం, డిపో అధ్యక్షుడు బాబురావు, కార్యదర్శి పెంటయ్య, పద్మ, నిర్మల, చంద్రకళ పాల్గొన్నారు.

● జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్‌బండ్‌పై లైటింగ్‌, పారిశుద్ధ్యం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, కమిషనర్‌ నాగిరెడ్డి, కౌన్సిలర్‌ పడిగె శంకర్‌ ఉన్నారు.

అభ్యసన సామర్థ్యాలు

పెంపొందించాలి

కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేశ్‌కుమార్‌ సూచించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌, తాడూరు, తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాల్లోని పలు పాఠశాలలు, కేజీబీవీల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, విద్యాబోధన, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆయా మండలాల్లో ఎస్‌ఏ–1 పరీక్షల మూల్యాంకనం, మధ్యాహ్న భోజనం వివరాలను తెలుసుకున్నారు. ఇన్‌చార్జి జీసీడీఓ నిర్మల, ఇన్‌చార్జి డీఎస్‌ఓ శైలజ ఉన్నారు.

సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి

కొల్లాపూర్‌: రైతులు సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు సూచించారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అండ్‌ నేచురల్‌ అగ్రికల్చర్‌ ఆధ్వర్యంలో బుధవారం కొల్లాపూర్‌లో కృషి సఖీలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధంగా లభించే కషాయాలు, కంపోస్టు ఎరువుల ద్వారా వ్యవసాయం చేయడం ద్వారా మంచి దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయన్నారు. సహజ వ్యవసాయంపై రైతులను చైతన్యం చేసేందుకు కృషి సఖీలు కృషి చేయాలని సూచించారు. చైల్డ్‌కేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో వారికి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ చిన్నహుస్సేన్‌ యాదవ్‌, మస్తాన్‌రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

30 క్వింటాళ్ల

నల్లబెల్లం స్వాధీనం

లింగాల: హైదరాబాద్‌ నుంచి ట్రాన్స్‌పోర్టు వాహనంలో మండల కేంద్రానికి తరలిస్తున్న 30 క్వింటాళ్ల నల్లబెల్లం, 100 కిలోల పటికను ఎకై ్సజ్‌ శాఖ సిబ్బంది బుధవారం స్వాధీనం చసుకున్నారు. వ్యాపారులు అక్రమంగా నల్లబెల్లం విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం అందడంతో ఎకై ్సజ్‌ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనంలో కిరాణం సరుకులతో పాటు నల్లబెల్లం తరలిస్తున్నట్లు గమనించారు. సోదాలు చేయగా 60 బస్తాల బెల్లం (3 వేల కిలోలు), 100 కిలోల పటిక లభ్యమైంది. వాహనం డ్రైవర్‌ మల్లేష్‌ను అదుపులోకి తీసుకొని వ్యాపారులు జి.సాయిబాబు, మాకం మురళి, సంతోష్‌, రాంపూర్‌ జగదీశ్వర్‌, శ్రీకాంత్‌పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా టాస్క్‌ ఫోర్సు సీఐ నాగార్జురెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సీఐ ఓంకార్‌, టాస్క్‌ ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement