కందనూలు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,15,824 మందికి నోటీసులు జారీ చేయగా.. ఇప్పటివరకు 1,15,494 మంది విచారణ పూర్తి చేశామన్నారు. 323 కేసుల్లో విచారణ గడువు ముగిసిందని.. 7 కేసులకు రీషెడ్యూల్ గడువు ముగిసిందని కలెక్టర్ వివరించారు. డీఈఓ స్థాయిలో మొత్తం 1,036 కేసులు పెండింగ్‌లో ఉండగా.. 123 కేసులు 5 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 6,904 కేసులు పరిశీలన చేయగా.. మరో 5 కేసులు ఇంకా వెరిఫై చేయాల్సి ఉందన్నారు. అలాగే కేటగిరీ వారీగా డిస్పోజల్ స్థితిని కూడా కలెక్టర్ వివరించారు. మొత్తం 509 కేసులు ఫైనల్‌కు అనర్హమైనవిగా గుర్తించగా.. 1,06,793 కేసులు విచారణ అనంతరం ఫైనల్ చేయనున్నట్లు తెలిపారు. 3,862 కేసులు విచారణ లేకుండానే ఫైనల్ చేసినట్లు చెప్పారు. ఇతర అంశాలకు సంబంధించి ఫైనల్ కోసం పార్క్ చేసిన ఓట్లు మొత్తం 5,02,767 ఉన్నాయని తెలిపారు. అలాగే లాజికల్ డిస్క్రెపెన్సీస్ 1,00,965, నో మ్యాపింగ్ 9,716, లాజికల్ డిస్క్రెపెన్సీస్ 154, నో మ్యాపింగ్ 355 ఉన్నాయని వివరించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 43,569, అచ్చంపేటలో 39,594, కొల్లాపూర్‌లో 32,687 నోటీసులు జారీ చేయాల్సినవిగా నమోదయ్యాయని తెలిపారు. సర్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన ఉన్నారు.


