తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా

Oct 8 2026 3:42 AM | Updated on Oct 8 2026 3:42 AM

● రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్‌ కేసులు వేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బుధవారం కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేశానని.. వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. నిరంజన్‌రెడ్డి కొల్లాపూర్‌లో ఒకసారి పోటీచేస్తే డిపాజిట్‌ కూడా రాలేదన్నారు. వనపర్తి ప్రజలు ఒకసారి ఆయన పాలన చూశాక, రెండోసారి గెలిపించకుండా ఇంటికి పంపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన గెలిచేది లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను తాను కుర్చీ వేసుకొని మరీ పూర్తిచేయిస్తానని కేసీఆర్‌ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. మరి ఎందుకు ప్రాజెక్టులను పూర్తిచేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటలను కాపాడేందుకే వారాబందీ విధానం అమలుచేస్తున్నామని వివరించారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో పంపులను నడిపేందుకు చర్చలు చేపట్టామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement