
పాలమూరు వెనుకబాటుకు పాలకులే కారణం
అచ్చంపేట రూరల్: పాలమూరు ఉమ్మడి జిల్లా వెనుకబాటుకు పాలకులే కారణమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన రిటైర్డ్ ఎంఈఓ పడాల బాలజంగయ్య మూడవ వర్ధంతి సభకు ప్రొఫెసర్లు హరగోపాల్, లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ప్రకృతిని ప్రేమించని వారు మనిషిని ప్రేమించలేరన్నారు. మానవ సంబంధాలు బాగుండాలంటే మానవీయ కోణం అవసరమన్నారు. మనిషి స్వార్థపరుడని.. స్వార్థంగానే బతకాలనే వాదన, సిద్ధాంతం ముందుకొచ్చిందన్నారు. పెట్టుబడిదారి విధానం ప్రజల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసిందన్నారు. భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణలో అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. పాలమూరు విశ్వవిద్యాలయం 20మంది ప్రొఫెసర్లతో కొనసాగుతుందని.. జిల్లా వెనుకబాటుపై చర్చించాల్సిన అవసరముందన్నారు. గతంలో భూమి విక్రయించాలంటే రైతులు ఏడ్చేవారని.. ఇప్పుడు అంగడి సరుకై ందని అన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, నారాయణ, మనోహర, బాలస్వామి, లక్ష్మణ్‌నాయక్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్, శ్రీనునాయక్, రామస్వామి, విష్ణుమూర్తి, చందునాయక్, గోపాల్, రఘుపతిరావు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్