ప్రజావాణికి 38 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 38 ఫిర్యాదులు

Aug 5 2025 6:23 AM | Updated on Aug 5 2025 6:23 AM

ప్రజా

ప్రజావాణికి 38 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌: ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అదనపు కలెక్టర్‌కు వినతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రతి అర్జీదారుడు సమస్య పరిష్కారం కో సం తిరిగి అదే సమస్య విన్నవించకుండా జిల్లా అధికారులు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ప్రజావాణికి 38 ద రఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌, ఆయా విభాగా ల సూపరింటెండెంట్లు రవికుమార్‌, వెంకట్‌, శోభ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 10..

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్‌ గ్రీవెన్స్‌కు మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 8 భూ తగాదా, 2 న్యాయం చేయాలని ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బల్మూర్‌: మండలంలోని ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ బోధించడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పరంగి రవి సోమవారం ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో నేరుగా వచ్చి తమ దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఇంటర్వ్యూ నిర్వహించి అదే రోజు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

రేపు జాబ్‌ మేళా

కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్‌ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.97012 00819 సంప్రదించాలని కోరారు.

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

కొల్లాపూర్‌: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథి గృహంలో నిర్వహించిన సీపీఐ పార్టీ మండల సమావేశాని కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన ఫయాజ్‌ ఇటీవలే సీపీఐ జిల్లా కార్యదర్శిగా నియామకం కావడంతో ఆయనను పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాగర్‌కర్నూల్‌ లో వేలాదిగా లంబాడీలు, చెంచులు ఉన్నారన్నారు. వారి జనాభా ఆధారంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. నల్లమలలోని వనరులను వినియోగించుకునే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. నల్లమల పరిసర ప్రాంతాలను ఏజెన్సీ కారిడార్‌గా ప్రకటించాలని కోరారు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ స్థాపించాలన్నారు. మొలచింతలపల్లి, అసద్‌పూర్‌ శివార్లలో ఉన్న రాజవంశస్థుల భూములను సీలింగ్‌ యాక్టు ప్రకారం పేదలకు పంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో నాయకులు శివుడు, ఇందిర, యూసుఫ్‌, కుర్మయ్య, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 38 ఫిర్యాదులు 
1
1/1

ప్రజావాణికి 38 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement