భూకేసులు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూకేసులు త్వరితగతిన పరిష్కరించాలి

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

మంగపేట : ఏజెన్సీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న 1/70 భూ కేసులను త్వరితగతిన పరిష్కరించి అక్రమాలకు గురైన ఆదివాసీల భూములను తిరిగి అర్హులకు అప్పగించాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం(ఏఈడబ్ల్యూసిఏ) ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఆదివాసీల భూమి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను సత్వరమే పరిష్కరించి ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఆదివాసీల భాషను ప్రోత్సహించడంతో పాటు వారి సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆదివాసీల జీవనాధారమైన జల్‌–జంగల్‌–జమీన్‌ హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతర కృషి అవసరమన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గొప్ప సమ్మారావు, కొండ చెంచయ్య, తోలెం నర్సింహారావు, తాటి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ మిడియం బాబూరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement