జిల్లాలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువతులు, మహిళలు తీరొక్క పూలను తీసుకొచ్చి
బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో పూజించారు. సాయంత్రం బతుకమ్మలతో ఆలయాలకు చేరుకున్నారు. చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడి పాడారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ములుగులో
బతుకమ్మ ఆటస్థలం వద్ద రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి సౌకర్యాన్ని కల్పించారు. – ములుగు/ములుగు రూరల్


