పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మేడారం గ్రామంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని బలరాం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్‌ లాల్‌, ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్‌, కోకన్వీనర్‌లు కృష్ణాకర్‌రావు, స్వరూప, జిల్లా ఉపాధ్యక్షుడు భర్తపురం నరేశ్‌, మేడిశెట్టి ఓమ్రా, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement