ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలి తాలు వచ్చాయి. వరంగల్‌ రీజియన్‌లో రెండు కూ టముల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. ను వ్వా.. నేనా? అన్నట్లు జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. గుర్తింపు పొందడాని కి 50శాతానికి పైగా మెజారిటీ సాధించాలి. అయితే ఏ కూటమి కూడా 50 శాతం కూడా ఓట్లు సాధించలేదు. దీంతో ఏ యూనియన్‌ క్లాస్‌–6 (రీజి యన్‌)లో గుర్తింపు సాధించలేదు. గుర్తింపు సాధించడానికి 1,521 ఓట్లు అవసరం కాగా, ఏ ఒక్క కూట మికి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. పోస్టల్‌ ఓట్లు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందే కూటమిని బట్టి వ రంగల్‌ రీజియన్‌ గుర్తింపు ఆధారపడి ఉంది. ఫలి తాలను ఈనెల 17న అధికారికంగా ప్రకటిస్తారు.

ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల్లో గుర్తింపు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చాలా కాలం తర్వాత ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు శుక్రవారం జరిగాయి. 98.19 శాతం పోలింగ్‌ నమోదైంది. రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా.. 2,987 ఓట్లు పోలయ్యాయి. 55 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గుర్తింపు ఎన్నికల్లో పోటీ కోసం రెండు ఐ క్య కూటములు చివరి ఓటరు వరకు మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. కార్మిక శాఖ పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం కౌంటింగ్‌ చేపట్టారు. దూరప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారు.. ఇతర విధుల్లో ఉండి పోలింగ్‌కు హాజరు కాలేని వా రి కోసం ఈనెల 15, 16 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత మొత్తం పోలింగ్‌ శాతంపై స్పష్టత రానుంది.

రెండు కూటములకు దక్కని స్పష్టమైన మెజారిటీ

వరంగల్‌ రీజియన్‌లో

98.19 శాతం పోలింగ్‌

మొత్తం ఓట్లు 3042,

పోలైన ఓట్లు 2,987

ఈ నెల 15, 16 తేదీల్లో

పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం

వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా 2,987 ఓట్లు పోలయ్యాయి.

ప్రస్తుతం అందిన సమాచారం మేరకు క్లాస్‌–6 (రీజియన్‌)లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ 1,478 ఓట్లు రాగా, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌కు 1,438 ఓట్లు వచ్చినట్లు అంచనా.

క్లాస్‌–6 (రాష్ట్ర)లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌కు 1,316 ఓట్లు, ఎంప్లాయీస్‌ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి.

ప్రస్తుత పోలింగ్‌ సరళిని చూస్తే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

క్లాస్‌–3లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ నేతృత్వంలోని కూటమికి 1,478 ఓట్లు రాగా, క్లాస్‌–6లో 1,316 ఓట్లు వచ్చాయి. 162 ఓట్లు తక్కువ వచ్చాయి.

క్లాస్‌–3లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతృత్వంలోని ఎన్‌ఎంయూకు 1,438 ఓట్లు రాగా, క్లాస్‌–6లో ఎంప్లాయీస్‌ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి. 198 తక్కువ వచ్చాయి.

క్లాస్‌–3తో పోలిస్తే క్లాస్‌–6కు ఎంప్లాయీస్‌ యూనియన్‌ వైపు కార్మికులు మొగ్గు చూపారు. క్లాస్‌–3లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ వైపు మొగ్గు చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement