ఏటూరునాగారం: గిరిజన విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా స్టూడెంట్ లెడ్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్ లెడ్ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. మండలంలోని చిన్నబోయినపల్లి పల్లె దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రాలను పీఓ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో లిటరేచర్ క్లబ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ క్లబ్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లబ్, ఎకో క్లబ్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ క్లబ్‌ల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం చిన్నబోయినపల్లిలో పల్లె దవాఖానాలోని రికార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.


